Chandranna Bima Scheme Details
Chandranna Bima Scheme Details

Chandranna Bima Scheme Details | చంద్రన్న బీమా పథకం పూర్తి వివరాలు

Chandranna Bima Scheme Telugu – చంద్రన్న బీమా పథకం అంటే ఏమిటి?

చంద్రన్న బీమా పథకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకం. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, BPL (Below Poverty Line) కుటుంబాలలోని ప్రధాన ఆదాయదారుడు (సంపాదించే వ్యక్తి ) అకస్మాత్తుగా మరణించినా లేదా శాశ్వత వైకల్యం వచ్చినా, వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం.

ప్రధాన ఆదాయదారుడి మరణం లేదా ప్రమాదం వల్ల కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం Chandranna Bima Scheme అమలు చేసింది.

చంద్రన్న బీమా పథకం యొక్క ప్రయోజనాలు (Benefits)

ఈ పథకం కింద లబ్ధులు ఈ విధంగా ఉంటాయి:

  • 18 నుంచి 50 సంవత్సరాల వయస్సులో సహజ మరణం జరిగితే నామినీకి రూ.1 లక్ష ప్రభుత్వమే నేరుగా అందిస్తుంది
  • 18 నుంచి 70 సంవత్సరాల వయస్సులో ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం జరిగితే రూ.5 లక్షల వరకు బీమా సహాయం అందుతుంది

ఈ బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది, లబ్ధిదారులకు ఎలాంటి ఖర్చు ఉండదు.

అర్హతలు (Eligibility Criteria)

చంద్రన్న బీమా పథకానికి అర్హులు ఎవరు అంటే?

వయస్సు 18 నుండి 70 సంవత్సరాల మధ్య ఉండాలి

BPL (Below Poverty Line) దారిద్య్రరేఖకు దిగువన కుటుంబానికి చెందినవారు కావాలి

కుటుంబంలో ప్రధాన ఆదాయదారుడు కావాలి,ఆధార్ కార్డ్ తప్పనిసరి

వ్యవసాయ కార్మికులు (Agricultural Labourers)
భవన నిర్మాణ కార్మికులు (Construction Workers)
చేతివృత్తులవారు (Artisans)
చిరు వ్యాపారులు, విక్రేతలు (Small Traders, Vendors)
హమాలీలు మరియు షాప్ ఉద్యోగులు (Hamalis, Shop Employees)

అమలు చేసే శాఖలు (Implementation)

నోడల్ ఏజెన్సీ: లేబర్ డిపార్ట్‌మెంట్, అమలు శాఖ: GSWS (గ్రామ/వార్డు సచివాలయాలు)

ప్రతి గ్రామం మరియు వార్డు సచివాలయం ఈ పథకం కోసం బెనిఫిషియరీ ఫెసిలిటేషన్ సెంటర్ గా పనిచేస్తుంది.

Chandranna Bima Scheme Apply | చంద్రన్న బీమా పథకం నమోదు

గ్రామ/వార్డు వాలంటీర్లు డోర్ టు డోర్ సర్వే ద్వారా వివరాలు సేకరిస్తారు,అర్హులైన వారిని పథకంలో నమోదు చేస్తారు,నామినీ వివరాలు కూడా నమోదు చేస్తారు

Chandranna Bima Scheme list లో పేర్లు ఎలా చెక్ చేస్కోవాలి?

ముందు గా ఏదైనా బ్రౌసర్ లో https://chandrannabima.ap.gov.in/ క్లిక్ చేయండి మొబైలు లో అయితే ఇలా వస్తుంది ఇక్కడ పైన కుడి వైపు కనిపిస్తున్న 3 అడ్డ గీతాల మీద క్లిక్ చేస్తే ఇందులో సెర్చ్ ఆప్షన్ వస్తుంది సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీకు సంవత్సరలు కనిపిస్తాయి ఇక్కడ మీరు ఏ సంవత్సరం కావాలో ఎంచుకుంటే తర్వాత ఆధార నెంబర్ , రైస్ కార్డ్ నెంబర్ , లేదా మీ పేరు తో చెక్ చేస్కోవచ్చు ఇక్కడ మీ జిల్లా, మీ మండలం, మీ సెక్రటేరియట్ కూడా సెలెక్ట్ చేసి కింద ఉన్న సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీ డీటైల్స్ వస్తాయి. మీ దగ్గర ఆధార నెంబర్, రైస్ కార్డ్ నెంబర్ ఉంటే సింపుల్ గా పాలసీ డీటైల్స్ వస్తాయి

Step-1

Step-2

Step-3

Step-4

Ai Image Prompts in Telugu

చంద్రన్న బీమా పథకం అనేది పేద కుటుంబాలకు అత్యంత ఉపయోగకరమైన స్కీమ్. కుటుంబ ప్రధాన ఆదాయదారుడికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే, ఈ పథకం కుటుంబానికి పెద్ద అండగా నిలుస్తుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకం వివరాలు తెలుసుకుని తప్పకుండా నమోదు చేసుకోవాలి.

చంద్రన్న బీమా పథకం అంటే ఏమిటి?

చంద్రన్న బీమా పథకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక సామాజిక భద్రతా పథకం. BPL కుటుంబాలలోని ప్రధాన ఆదాయదారుడికి మరణం లేదా శాశ్వత వైకల్యం వస్తే ఆర్థిక సహాయం అందించడమే దీని లక్ష్యం.

చంద్రన్న బీమా పథకానికి ఎవరు అర్హులు?

18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, BPL కుటుంబానికి చెందిన ప్రధాన ఆదాయదారులు ఈ పథకానికి అర్హులు.

చంద్రన్న బీమా పథకం కింద ఎంత బీమా మొత్తం అందుతుంది?

18–50 సంవత్సరాల వయస్సులో సహజ మరణం జరిగితే రూ.1 లక్ష, 18–70 సంవత్సరాల వయస్సులో ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం జరిగితే రూ.5 లక్షల వరకు సహాయం అందుతుంది.

చంద్రన్న బీమా పథకానికి ఎలా నమోదు చేయాలి?

గ్రామ/వార్డు సచివాలయం ద్వారా డోర్ టు డోర్ సర్వేలో లబ్ధిదారుల వివరాలు సేకరించి ఆటోమేటిక్‌గా నమోదు చేస్తారు. అర్హులైన వారు తమ సమీప సచివాలయాన్ని కూడా సంప్రదించవచ్చు.

చంద్రన్న బీమా పథకానికి ప్రీమియం ఎవరు చెల్లిస్తారు?

ఈ పథకం కింద బీమా ప్రీమియం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లిస్తుంది. లబ్ధిదారులకు ఎలాంటి చెల్లింపు అవసరం లేదు.

చంద్రన్న బీమా క్లెయిమ్ ఎలా చేయాలి?

లబ్ధిదారుడి మరణం లేదా వైకల్యం జరిగినప్పుడు, సంబంధిత గ్రామ/వార్డు సచివాలయం ద్వారా అవసరమైన పత్రాలతో క్లెయిమ్ ప్రక్రియ పూర్తి చేయాలి.