telugutech.in Mi CC9 Pro Specifications,mi cc9 pro India price


త్వరలో 5 కెమెరాలతో ఎంఐ సీసీ9 ప్రో ఫోన్ విడుదల
2838 వీక్షించారు
బడ్జెట్​ ధరల్లో స్మార్ట్​ఫోన్లు అందించే చైనా దిగ్గజ సంస్థ షియోమీ నుంచి త్వరలో మరో కొత్త మొబైల్​ రాబోతుంది. వెనుకవైపు 5 కెమెరాలతో రూపొందించిన ఎంఐ సీసీ9 ప్ర స్మార్ట్​ఫోన్​ను నవంబర్ ​5న విడుదల చేసేందుకు షియోమీ సిద్ధమైంది. సీసీ9 ప్రోకు సంబంధించి పూర్తి ఫీచర్లను షియోమీ వెల్లడించలేదు. మీటూ సంస్థ భాగస్వామ్యంలో వచ్చిన సీసీ స్మార్ట్​ఫోన్ల సిరీస్​లో సీసీ9 ప్రో మూడోది. ఇప్పటివరకు ఈ సిరీస్​లో సీసీ9, సీసీ9 ఈ ఫోన్లను షియోమీ విడుదల చేసింది.

సీసీ9ఈను ప్రపంచ మార్కెట్లో ఎంఐ ఏ3 ఆండ్రాయిడ్​ వన్​ పేరుతో విడుదల చేసింది. సీసీ9 ప్రోను ఏ3 ప్రోగా విడుదల చేయనున్నట్లు సమాచారం. 6జీబీ ర్యామ్​-128 జీబీ రామ్​, 8 జీబీ ర్యామ్​-128జీబీ రామ్​, 8జీబీ ర్యామ్​-256 జీబీ వేరియంట్లలో లభించనుంది.


5 కెమెరాలు ఫోన్ …


అధికారిక సమాచారం ప్రకారం.. సీసీ9 ప్రోలో కెమెరాపై షియోమీ ప్రధానంగా దృష్టి సారించింది. వెనుకవైపు 5 కెమెరాలను ఇందులో పొందుపరిచింది. ప్రధాన కెమెరాలో శాం​సంగ్ రూపొందించిన 108 మెగాపిక్సల్​ సెన్సార్​ను అమర్చింది. ఫొటో బ్యాక్​గ్రౌండ్​ స్పష్టత కోసం 12 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 8ఎంపీ టెలిఫొటో లెన్స్​, మాక్రో లెన్స్, డెప్త్ సెన్సార్లనూ పొందుపరిచింది. ఒప్పో రెనో ఫోన్ల తరహాలో 5 రెట్లు ఆప్టికల్​ జూమ్​ ఆప్షన్​ కూడా షియోమీ ఇచ్చింది. మార్కెట్లో ప్రస్తుతానికి 5 కెమెరాలున్న స్మార్ట్​ ఫోన్​ నోకియా 9 ప్యూర్​వ్యూ మాత్రమే.


Specifications


  1. ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
  2. ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 730జి
  3. డిస్ ప్లే: 6.47 ఇంచులు
  4. రిజల్యూషన్: 1080X2340 పిక్సెల్స్
  5. ర్యామ్: 6 జీబీ ♦ స్టోరేజీ: 64 జీబీ
  6. రియర్ కెమెరా: 108+13+8 మెగాపిక్సల్
  7. ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సల్
  8. బ్యాటరీ సామర్థ్యం: 4000mAh
  9. ధర రూ.16,000 నుంచి రూ.20,000 మధ్య ఉండొచ్చు.